
ఐపీఎల్ అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. మరికొందరు పోలీసు కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ అభిమానులు విజయవాడలో చేసిన అత్యుత్సాహంపై చర్యలు ప్రారంభించారు పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తే.. ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
ఐపీఎల్‌లో ఆర్సీబీ గెలుపు.. బెంగళూరులోనే కాదు.. బెజవాడలోనూ భయబ్రాంతులకు గురి చేసింది. క్రికెట్‌పై అభిమానం హద్దులు దాటింది. విజయవాడలో మే 3వ తేదీన అర్థరాత్రి ఆర్బీసీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బందర్ రోడ్డులో పోలీసులు ఏర్పాటు చేసే బారీ కేడ్స్ లాక్కెళ్లారు. బందర్ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి డ్యాన్సులు వేడయంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైకి కూడా ఎక్కారు. డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లను పీకేసి.. వాటితో నానా హంగామా చేశారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. బారీకేడ్లు లాక్కెల్లిన వారికి పోలీస్ స్టైల్‌లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
బందర్ రోడ్డులో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్‌తో వెళ్లిన యువకులు కింద పడటంతో ఒకరు చనిపోయారు. బైక్ అదుపు తప్పు కింద పడిపోవడంతో యువకుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే శేఖర్ అనే యువకుడు అక్కడిక్కకే చనిపోయాడు. మృతుడు రైల్వే పార్శిల్ కార్యాలయంలో పని చేసే శేఖర్‌గా గుర్తించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మాచవరం పోలీసులు. హద్దులు మీరి, ఎలాంటి పర్మిషన్లు లేకుండా రోడ్లపై వేడుకలు చేయడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా.. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. తాము చేసిన తప్పు ఎవరూ చేయొద్దని.. యువకులతోనే చెప్పిస్తున్నారు.
అభిమానం ఉండాలి.. కానీ హద్దులు దాటడమే డేంజర్. ఫలితంగా ఓ యువకుడి ప్రాణం పోయింది. కొందరు యువకులు కేసులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. చట్టం ముందు ఎవ్వరూ అతీతులు కారు అంటున్నారు పోలీసులు. రోడ్లపై హంగామా చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే.. తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..