Maoist Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. డీఐజీ రంగారవు ఎదుట లొంగిపోయిన కీలక నాయకురాలు..

|

Jan 04, 2021 | 8:43 AM

Maoist Surrender: విశాఖపట్నం ఏజెన్సీలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు ఏసీఎం స్వర్ణ.. డీఐజీ రంగారావు ఎదుట..

Maoist Surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. డీఐజీ రంగారవు ఎదుట లొంగిపోయిన కీలక నాయకురాలు..
Follow us on

Maoist Surrender: విశాఖపట్నం ఏజెన్సీలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు ఏసీఎం స్వర్ణ.. డీఐజీ రంగారావు ఎదుట లొంగిపోయారు. పెదబయలు ఏరియా కమిటీలో సభ్యురాలిగా స్వర్ణ ఉన్నారు. ఏసీఎం స్వర్ణ తలపై రూ.4 లక్షల రివార్డు ఉంది. చాలా కేసుల్లో స్వర్ణ పాత్ర ఉన్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, స్వర్ణతో పాటు మరో మిలీషియా కమాండర్, ఇద్దరు మిలీషియా సభ్యులు కూడా డీఐజీ రంగారావు ఎదుట సోమవారం నాడు లొంగిపోయారు. స్వర్ణ లొంగుబాటు ఏజెన్సీలో మావోలకు ఎదురు దెబ్బ అని పోలీసులు చెబుతున్నారు. అనారోగ్యం, ఇతర సమస్యల కారణంగానే స్వర్ణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా, మావోయిస్టులు దండకారణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీఐజీ రంగారావు పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే, దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఎన్‌కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి.

 

Also read:

Time Slot For Vaccine: వ్యాక్సిన్‌ పంపిణీకి హైదరాబాద్‌లో కొత్త విధానం.. సమయానికి వెళ్లేలా ఏర్పాటు..

Bird Flu Alert: రాష్ట్రాలకు కేంద్రం హై అలర్ట్.. బ‌ర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాప్తి చెందే అవకాశం..పలు ఆదేశాలు జారీ