అబ్బ.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు.. ఎంట్రీ ఇచ్చిన ONGC, చమురు సంస్థలు..

నంద్యాల జిల్లాలో చమురు నిక్షేపాలు...! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా... రంగంలోకి దిగిన ONGC శాంపుల్స్‌ సేకరించడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి రుద్రవరంలో చమురు నిక్షేపాలున్నాయన్న ప్రచారం గతకొన్నిరోజులుగా జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై తెగ చర్చ జరుగుతోంది. చిలకలూరు పరిసరాల్లోనూ చమురు నిక్షేపాలున్నట్టు అక్కడి స్థానికులు కూడా పదేపదే చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. 

అబ్బ.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు.. ఎంట్రీ ఇచ్చిన ONGC, చమురు సంస్థలు..
Nandyal oil, gas reserves

Updated on: Mar 29, 2026 | 6:59 AM

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాలున్నాయన్న ప్రచారం గతకొన్నిరోజులుగా జోరుగా సాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై తెగ చర్చ జరుగుతోంది. చిలకలూరు పరిసరాల్లోనూ చమురు నిక్షేపాలున్నట్టు అక్కడి స్థానికులు కూడా పదేపదే చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే… అంతా ఉత్తితే అన్న చర్చా మరోవైపు నుంచి నడుస్తోంది. ఇలా రకరకాల ప్రచారాలు నడుమ ONGC అదే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్‌ కార్పొరేషన్‌ సహా కొన్ని చమురు సంస్థలు ఫీల్డ్‌లోకి ఎంటరవ్వడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

గ్యాస్ సహా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని ప్రచారం జరిగిన రుద్రవరం, చిలకలూరు ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించాయి చమురు సంస్థలు. మరి నిజంగానే ప్రజలు అనుకుంటున్నట్టు చమురు నిక్షేపాలు ఉన్నాయా..? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి…? అని మరి కొన్ని రోజుల్లో చెబుతామని క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఇక మిడిలీస్ట్ యుద్ధం నేపథ్యంలో ఈ చమురు నిక్షేపాల అంశం ఆసక్తి పెంచుతోంది.

అక్కడెక్కడో యుద్ధం జరుగుతోంటే ఇక్కడ మనం గ్యాస్‌కు ఇబ్బంది పడుతున్నాం… ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి… అలాగే పెట్రోల్‌ బంక్‌ల దగ్గర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో నంద్యాల జిల్లాలో నిజంగానే చమురు నిక్షేపాలు ఉన్నాయని తేలితే పరిస్థితి ఎలా ఉంటుంది…? నిజంగానే బిగ్ రిలీఫ్‌ ఉంటుందా…? అన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మరి చూడాలి… శాంపిల్స్ సేకరించిన చమురు సంస్థలు ఏం తేలుస్తాయో..!

వీడియో చూడండి..

మొత్తానికి గ్యాస్, చమురు నిక్షేపాలు ఉన్నాయన్న సమాచారం.. ఏపీలో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us