Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ.

|

Mar 07, 2023 | 4:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకం నిధులను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి...

Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ.
Cm Jagan (file Photo)
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకం నిధులను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం సీఎంఓ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీలను అధికారులు ఖరారు చేశారు.

ఇందులో భాగంగా మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతోపాటుగా రాగిజావ అమలు ప్రారంభించనున్నారు. ఇక మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించచనున్నారు. మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయనున్నారు. ఆరోజు జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయనున్నారు.

మార్చి 22వ తేదీ ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లను ప్రకటించనున్నారు. అనంతరం ఈ అవార్డులను, రివార్డులను ఏప్రిల్‌ 10వ తేదీన అందించనున్నారు. ఇక మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరాను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్‌ 5 వరకూ కానసాగనుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు చేయనున్నారు. అదే విధంగా ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..