Odisha – Andhra: ఆంధ్రాలోనే ఉంటాం.. తెగేసిన చెప్పిన కొటియా ప్రజలు.. విజయనగరంలో గిరిజనులకు సన్మానం

|

Oct 25, 2021 | 2:59 PM

Kotia Tribal Villagers: కొటియాలో టెన్షన్‌కి తెరదించారు. ఏపీ అధికారుల కృషి ఫలించింది. 50 ఏళ్లుగా నెలకొన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అక్కడి గిరిజనులు ఆకర్షితులయ్యారు.

Odisha - Andhra: ఆంధ్రాలోనే ఉంటాం.. తెగేసిన చెప్పిన కొటియా ప్రజలు.. విజయనగరంలో గిరిజనులకు సన్మానం
Kotia
Follow us on

కొటియాలో టెన్షన్‌కి తెరదించారు. ఏపీ అధికారుల కృషి ఫలించింది. 50 ఏళ్లుగా నెలకొన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అక్కడి గిరిజనులు ఆకర్షితులయ్యారు. తాము ఏపీ పౌరులమేనంటూ నినాదాలు చేశారు. ఒడిశా అధికారులు, పోలీసులపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరి కొట్టారు. విజయనగరంజిల్లా అధికారుల విశేష కృషి కారణంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కొటియా విలేజ్‌ గ్రూప్‌ గ్రామ ప్రజలకు చేరువయ్యాయి. ప్రభుత్వ పథకాలపై మొదటి నుంచి అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఉచితవైద్యం మొదలు, కరోనా వ్యాక్సినేషన్‌, నవరత్నాలు వంటి పథకాలు కిందిస్థాయి వరకూ చేరడంతో గిరిజనుల్లో మార్పు వచ్చింది.

దాంతో ఏపీలోనే ఉండేందుకు కొటియా గిరిజన గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సాలూరు MLA పీడిక రాజన్నదొరను కలిసి ఏపీలోనే కొనసాగుతామని అంగీకారపత్రం ఇచ్చారు. ఒడిశాతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలను ఎమ్మెల్యే రాజన్నదొర అభినందించారు.

ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనుల ధైర్యసాహసాలకు ముగ్థులైన విజయనగరంజిల్లా కలెక్టర్‌..కొటియా గ్రూప్‌ ప్రజలను కలెక్టరేట్‌కి పిలిపించారు. కలెక్టరేట్‌లో వారిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలు వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.గత కొన్నేళ్లుగా విజయనగరంజిల్లా కొటియా విలేజ్‌ నివురుగప్పినా నిప్పులా తయారైంది. ఆదివారం ఒడిశా అధికారులు తొలగించిన తెలుగు బోర్డులను కొటియా గ్రామ ప్రజలు తిరిగి పెట్టారు.

ఈ విషయంలోనే గిరిజనులు, ఒడిశా అధికారులు మధ్య వివాదం తలెత్తింది. పెద్దయెత్తున పోలీసులు కొటియా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగు బోర్డులు పెడుతున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు, అధికారుల ఓవరాక్షన్‌పై స్థానిక గిరిజనులు తిరగబడ్డారు. పగలుచెన్నూరు, డోలియాంబల దగ్గర ఒడిశా పోలీసులతో బాహాబాహీకి సిద్ధమవ్వడంతో యుద్ధ వాతావరణం కనిపించింది.

ఇక శనివారం ఉదయం YSR ఆసరా పథకం అమలు మీటింగ్‌కి వెళ్లిన ఆంధ్రా అధికారులను ఒడిశా అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి అడ్డుకున్నారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇది తమ గ్రామమని..ఇక్కడికి మరోసారి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే.. ఆంధ్రాలో ఉండే సంక్షేమ పథకాలు, ఇక్కడి పాలన స్థానిక గిరిజనులను ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఒడిశా రేషన్‌, ఓటర్‌ కార్డులు వద్దని.. తాము ఆంధ్రా పౌరులేమనని గిరిజనులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Andhra Pradesh: అర్థరాత్రి ఇంట్లోకి దూరి బొప్పాయి చెట్టుకు మేకులు కొట్టాడు.. అది గమనించిన స్థానికులు ఏం చేశారంటే..

AP Eamcet Counselling: ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం… రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..