Nandamuri Balakrishna: ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు ఘనంగా జరుగుతుంది. నందమూరి తారక రామారావు స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన ఆయన.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శత జయంతి వేడుకల్లో భాగంగా బాలకృష్ణ నేతృత్వంలోనే ఎన్టీఆర్ జిల్లా నిమ్మకూరులో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని నినదించిన ఆయనకు వందనాలంటూ పేర్కొన్నారు. ఆయన నిండైన మనసు వల్ల మనకు ఆరాధ్య దైవం అయ్యారు అంటూ.. బాలయ్య ఎన్టీయార్‌ని కొనియాడారు. ఎన్టీయార్ జన్మభూమి నిమ్మకూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు బాలక్రిష్ణ. నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఆయనకే అంకితమిస్తున్నాం అన్నారు.
కాగా.. బాలకృష్ణ రాకతో నిమ్మకూరులో సందడి నెలకొంది. మొదట వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎన్టీయార్ దంపతుల విగ్రహాలకు పుష్పమాల వేసి నివాళి అర్పించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..