ఎన్టీఆర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన కలకలం సృష్టిస్తోంది. సిమెంట్ రోడ్డుపై రక్తం లాంటి ఎర్రటి ద్రవం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదేం మాయనో అర్థం కాక.. ఆందోళన చెందుతున్నారు జనాలు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం శనగపాడులోని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డుపై ఎక్కడ నీళ్లు పోసినా రక్తం లాంటి ఎర్రటి ద్రవం పైకి వస్తోంది. అచ్చం రక్తం మాదిరిగా ఆ ద్రవం ఉండటంతో జనాలు భయపడుతున్నారు. ప్రతిసారి అలాగే వస్తుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు టెన్షన్ పడుతున్నారు. రాత్రిళ్లు నిద్ర లేకుండా రోడ్డుపైనే జాగారం చేశారు.
ఐతే కెమికల్స్ వల్లే ఇలా జరుగుతుందని కొందరు గ్రామ పెద్దలు చెబుతుంటే.. చేతబడి వల్ల ఇలా జరుగుతుందని మరి కొందరు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుందో అధికారులు తేల్చాలని కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తకున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..