AP Rains: హమ్మయ్యా.! గట్టెక్కిన తుఫాన్ గండం.. కానీ ఈ జిల్లాలకు ఫుల్‌గా వర్షాలే వర్షాలు

|

Oct 25, 2024 | 3:41 PM

దానా తుఫాన్‌ దెబ్బకు ఒడిశా చిగురుటాకులా వణుకుతోంది. తుఫాన్ తీరం దాటిన సమయంలో విరుచుకుపడిన రాకాసి గాలులు.. భారీవర్షం.. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. NDRF, SDRF బలగాలతోపాటు జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

AP Rains: హమ్మయ్యా.! గట్టెక్కిన తుఫాన్ గండం.. కానీ ఈ జిల్లాలకు ఫుల్‌గా వర్షాలే వర్షాలు
Representative Image
Follow us on

ఈ రోజు అక్టోబరు 25 ఉదయం 0830 గంటలకు తీవ్రమైన తుఫాను “దానా” గంటకు 10 కిమీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి తుఫానుగా బలహీనపడి, ఉత్తర కోస్తా ఒడిశా మీదుగా 21.20° ఉత్తర అక్షాంశం, 86.70° తూర్పు రేఖాంశం, భద్రక్‌కు(ఒడిశా) ఈశాన్యంగా 30 కి.మీ దూరంలో.. ధమరాకు(ఒడిశా) వాయువ్యంగా 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుఫాను కేంద్రం చుట్టూ గరిష్ట స్థిరమైన గాలి వేగం గంటకు 80-90 కిలోమీటర్లు.. గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది తీరం దాటిన 6 గంటలలో తరువాత ఉత్తర ఒడిశా వద్ద వాయువ్య దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:
————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..