మరీ ఇంత ఘోరమా..! తండ్రి అంత్యక్రియలకు డబ్బులేవని కొడుకు చేసిన పనితో బిత్తరపోయిన కుటుంబీకులు..

|

May 04, 2023 | 8:13 PM

అయితే, విచారణ ప్రారంభించినట్లు తెలియగానే రాజశేఖర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు 62 ఏళ్ల బొమ్మ చిన్న పుల్లారెడ్డిగా పోలీసులు బెడ్‌షీట్ సహాయంతో గుర్తించారు. ఆసుపత్రిలో విచారణలో అతనికి టిబి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

మరీ ఇంత ఘోరమా..! తండ్రి అంత్యక్రియలకు డబ్బులేవని కొడుకు చేసిన పనితో బిత్తరపోయిన కుటుంబీకులు..
Death
Follow us on

అంత్యక్రియలు నిర్వహించే స్తోమతలేక తన తండ్రి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లినందుకు గానూ 24 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన యువకుడు.. దువ్వూరు మండలం చిన్న సింగనపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ప్రైవేట్ స్కూల్ బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 29న కడప-రాయచోటి (NH-40) హైవే వెంబడి గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో కుళ్లిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని పోలీసు అధికారులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గువ్వలచెరువు ఘాట్‌పై ట్రక్కు ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ బి అరుణ్‌రెడ్డి తెలిపారు. గత శనివారం ఆ రోడ్డుపై బహిర్భూమికి వెళ్లిన ఒక ట్రక్కు డ్రైవర్, క్లీనర్ దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చుట్టూ పరిశీలించారు. దాంతో వారికి కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాం కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు..మృతదేహం బాగా కుళ్ళిపోయి ఉండటంతో గుర్తుపట్టటం కష్టంగా మారిందన్నారు. దానిని ఆసుపత్రికి తరలించలేము కాబట్టి, సంఘటన స్థలంలోనే విచారణ, పోస్ట్‌మార్టం ఫార్మాలిటీలను పూర్తి చేశారు. తొలుత హత్యగా అనుమానించినా.. పోస్టుమార్టం నివేదికలో ఆ వ్యక్తి సహజ మరణమేనని నిర్ధారించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మృతుడు 62 ఏళ్ల బొమ్మ చిన్న పుల్లారెడ్డిగా పోలీసులు బెడ్‌షీట్ సహాయంతో గుర్తించారు. ఆసుపత్రిలో విచారణలో అతనికి టిబి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో మృతుడు స్వయంగా కడపలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరాడు. తండ్రి పరిస్థితి గురించి తెలుసుకున్న కుమారుడు రాజశేఖర్ ఫిబ్రవరి 23న ఆసుపత్రికి వచ్చి చివరి క్షణాల్లో ఉన్నందున డిశ్చార్జి చేయించారు. ఇంటికి వెళ్లేందుకు ఇద్దరు అద్దెకు తీసుకున్న ఆటోలోనే చిన పుల్లారెడ్డి మృతి చెందాడు. తనకు డబ్బు లేదని, అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి లేదని, తనను గువ్వలచెరువు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో దింపాలని రాజశేఖర్ ఆటో డ్రైవర్‌ను వేడుకున్నాడు. ఆటోడ్రైవర్ అంగీకరించి కడప-రాయచోటి హైవేపై గువ్వలచెరువు ఘాట్‌రోడ్డుపై ఒక చోట వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత రాజశేఖర్ తన తండ్రి మృతదేహాన్ని కొండపై నుండి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి తన తండ్రి మరణించారని, ఆసుపత్రిలో అంత్యక్రియలు నిర్వహించామని కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అయితే, విచారణ ప్రారంభించినట్లు తెలియగానే రాజశేఖర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..