Andhra and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

నెల్లూరు జిల్లా అలగానిపాడులో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 50ఎకరాల గడ్డివాముకు నిప్పుపెట్టారు. అవ్వాడి మల్లికార్జున అనే రైతు పశువులను మేపుతూ జీవిస్తున్నాడు.

Andhra and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..
Top 9 Telugu News
Follow us

|

Updated on: Oct 16, 2021 | 7:08 AM

1. నెల్లూరు జిల్లా అలగానిపాడులో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 50ఎకరాల గడ్డివాముకు నిప్పుపెట్టారు. అవ్వాడి మల్లికార్జున అనే రైతు పశువులను మేపుతూ జీవిస్తున్నాడు. అతనికి చెందిన గడ్డివాముల్నే ఆగంతకులు తగలబెట్టడంతో తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.

2. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో మళ్లీ రక్తం చిందింది. మాల మల్లేశ్వరస్వామి విగ్రహాల కోసం 24గ్రామాల ప్రజలు పోటీ పడ్డారు. ఈ కర్రల సమరంలో వందలాది మంది గాయపడ్డారు. నలుగురు పరిస్థికి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

3. ఆదిలాబాద్‌లో రావణ దహనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. పేల్చిన టపాసులు జనం మీదకు దూసుకొచ్చాయి. భయంతో జనం పరుగులు తీశారు. ఘటనలో పలువురికి గాయలయ్యాయి. వెంటనే పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది.

4. కామారెడ్డి జిల్లా గాంధారి మండలలో రావణ దహనం చేయడాన్ని నిరసిస్తూ అడ్డుకుంది ఓ వర్గం. దీంతో అవతలి వర్గం అడ్డుపడ్డవారితో గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జి చేశారు.ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.

5. రంగారెడ్డి జిల్లా బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అక్కడ అమ్మకాలు, వేలం ప్రక్రియను పరిశీలించారు మంత్రి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ మూసివేయడంతో ఇక్కడ తాత్కాలిక మార్కెట్‌ని ఏర్పాటు చేసారు.

6. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కర్నాటకలోని చిక్కజాజూర్ నుంచి జిందాల్‌ ఉక్కు ఫ్యాక్టరీకి వెళ్తున్న గూడ్స్‌ ట్రైన్ చక్రాలు ఊడిపోవడంతో పట్టాలు తప్పాయి. దీంతో హోస్పెట్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన రైలు 2గంటలు ఆలస్యంగా బయల్దేరింది.

7. అనంతపురం జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బి.పప్పూరు PHCని సందర్శించింది NQAS బృందం. మారుమూల ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందిస్తున్న ఆసుపత్రులను ఎంపిక చేసి నిధులు సమకూర్చనుంది.

8. ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఒడిశాలో స్థానిక సంస్థల ఎన్నికలుండటంతో అక్కడి ప్రజాప్రతినిధులు పర్యటనకు వెళ్తే … గ్రామాల్లోకి రావద్దంటున్నారు స్థానికులు. దీంతో అక్కడ మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

9. మహబూబాబాద్ జిల్లా ఊట్ల శివారు సరస్వతినగర్‌లో అక్రమ కలపను పట్టుకున్నారు. రూ.1.50 లక్షల విలువైన బిలుగుడు దుంగలను తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరవారితిమ్మాపురం, కార్లాయి అడవుల నుంచి వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

Read also: భక్తులు పరమ పవిత్రంగా భావించే చిన్నజీయర్ స్వామి వారి తిరునక్షత్రం మహోత్సవం నవంబరు 4 నుంచి..