Andhra Pradesh: వంట నూనె విషయంలో ఇలా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త

|

Mar 12, 2022 | 10:35 AM

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధాన్ని బూచిగా చూపి వంటనూనె వ్యాపారుల దందాపై టీవీ9 వరుస కథనాలతో ఏపీలో అధికారుల దాడులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో విజిలెన్స్ తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Andhra Pradesh: వంట నూనె విషయంలో ఇలా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త
Follow us on

Russia-Ukraine War: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధాన్ని బూచిగా చూపి వంటనూనె వ్యాపారుల దందాపై టీవీ9 వరుస కథనాలతో ఏపీలో అధికారుల దాడులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో విజిలెన్స్ తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గాజువాక గాయత్రి ట్రేడర్స్ లో పరిమితికి మించి వంటనూనె నిల్వలతో పాటు ధరలను, మాన్యుఫాక్చరిగ్‌ తేదీలను మార్ఫింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పాత లేబుళ్లపై కొత్త MRP స్టిక్కర్లు అంటించి, ఏకంగా టిన్ కు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు దోచేస్తున్నట్టు బయటపడింది. విశాఖలో జిల్లాలో 27 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూడా ఆయిల్ గొడౌన్లు, స్టాక్‌ పాయింట్స్‌, ప్రాసెసింగ్‌ యూనిట్స్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేశారు. ఇక్కడా అక్రమ నిల్వలు, ధరల ట్యాంపరింగ్‌ జరుగుతున్నట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, రావులపాలెం, రామచంద్రపురం, మండపేటలో కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. షాపుల్లో ఎలక్ట్రికల్ కాటాలకు స్టాంపింగ్ లేకపోవడం, ఆయిల్ డబ్బాలపై MRP ధరలు ట్యాంపరింగ్ చేయడం, రైస్ బ్యాగ్‌ లపై డిక్లరేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ అడ్రస్ లేకపోవడం వంటి అక్రమాలను గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట, సుళ్లూరుపేట తడలో కూడా తనిఖీలు జరిగాయి. వంట నూనెలను అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరులో కూడా దాడులు జరిగాయి. వంట నూనెల ధరల పెరుగుదలపై సీఎస్ సమీర్ శర్మ సమీక్షించారు. కలెక్టర్లు, విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయాలన్నా్రు. హోల్ సేల్ డీలర్లతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలన్నారు.

Also Read: Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు.. క్షణక్షణం.. భయం… భయం