MLA Kotamreddy: శాంతించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. అయినా తీవ్ర ఆసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అందరకీ షాక్ ఇచ్చారు. ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దొరక్కపోవడంతో కన్నీటి పర్యంతమైన ఆయన .. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని భావించారంతా..
Nellore News: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) అందరకీ షాక్ ఇచ్చారు. ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దొరక్కపోవడంతో కన్నీటి పర్యంతమైన ఆయన .. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని భావించారంతా.. ఆయనకు మంత్రి వర్గంలో బెర్త్ దక్కకపోవడంపై ఆయన అనుచరులు సైతం ఏకంగా రాజీనామాలకు కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు బై చెబుతారని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించారు కోటంరెడ్డి. నెల్లూరులో ఆయన ప్రారంభించిన గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇవాళ గొల్లకందుకూరులో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొంటానని కోటంరెడ్డి ప్రకటించారు.
కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో తాను మీడియాలో చెప్పినట్లు కొంత అసంతృప్తి కాదు.. తీవ్ర అసంతృప్తికి గురైయ్యానని కోటంరెడ్డి చెప్పారు. ఇప్పటికీ ఆ తీవ్ర అసంతృప్తి, బాధ తనకు ఉందన్నారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
Also Read..
Alia Bhatt- Ranbir Kapoor: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన అలియా భట్.. ఏమన్నదంటే..
Ambati Rambabu: స్విమ్మింగ్‌ఫుల్‌లో చిల్ అవుతున్న అంబటి.. వీడియో