Nellore District: భార్య ఉండనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. అతడి షాకింగ్ నిర్ణయంతో, జీవితాలు అస్తవ్యస్తం

|

Sep 23, 2021 | 5:44 PM

భార్యా భర్తల మధ్య కలహాలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. మనస్తాపం చెందిన ఓ భర్త తన తల్లికి, కూతురుకు విషం ఇచ్చి తానూ తీసుకున్నాడు.

Nellore District: భార్య ఉండనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. అతడి షాకింగ్ నిర్ణయంతో, జీవితాలు అస్తవ్యస్తం
Man Ends Life
Follow us on

భార్యా భర్తల మధ్య కలహాలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. మనస్తాపం చెందిన ఓ భర్త తన తల్లికి, కూతురుకు విషం ఇచ్చి తానూ తీసుకున్నాడు. ఇద్దరి ప్రాణాలు పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆ గ్రామస్తులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని మోదుగులపాలెం గ్రామస్తుడు మేర్లపాక మురళికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కూతురు, ఓ కొడుకు ఉన్నారు.. చక్కగా సాగుతున్న ఈ సంసారంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. కొంత కాలంగా భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు మురళి. భర్తపై అలిగి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మురళి బంధువులు సర్దిచెప్పినా ఆయన భార్య తిరిగి కాపురానికి రాలేదు.. దీంతో మనస్థాపానికి గురయ్యాడు.. తల్లి మస్తానమ్మ, కూతురు కావ్యశ్రీకి విషమిచ్చి తానూ తాగాడు. ఈ ఇంట్లో అలికిడిని గమనించిన స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మస్తానమ్మ ప్రాణాలు పోయాయి. వెంటనే వారు అంబులెన్స్‌లో మురళి, కావ్యశ్రీని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మురళి మరణించాడు.. కూతురు కావ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మురళి కుమారుడు లోకేష్‌ కనిపించకుండా పోయాడు.. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు.. మురళి కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం గ్రామస్తులను కలిచివేసింది. మనస్తాపంతో తీసుకున్న నిర్ణయం ఇన్ని జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది.

Also Read: మనిషి రక్తం మితిమీరి తాగింది.. చివరకు పొట్ట పగిలిపోయింది

“మత్తుపై ఉక్కుపాదం”.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు