Michaung Cyclone: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. వాయిదా పడిన నేవీ డే.. లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్‌పైనా ఎఫెక్ట్..

Legends Cricket Tournament: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. మరోవైపు నేడు తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపటికి మిచౌంగ్ తుఫాను గా బలపడనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని, 5 వతేదీ ఉదయం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు ఐఎండీ అధికారులు. రానున్న మూడు రోజులులో గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆంధ్ర ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Michaung Cyclone: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. వాయిదా పడిన నేవీ డే.. లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్‌పైనా ఎఫెక్ట్..
Michaung Cyclone

Edited By:

Updated on: Dec 02, 2023 | 9:24 AM

Michaung Cyclone Alert: మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఆంధ్రా పైకి దూసుకొస్తోంది. సైక్లోన్ మిచౌంగ్ నేపథ్యంలో డిసెంబర్ 4 న జరగాల్సిన నేవీ డే వేడుకలను వాయిదా వేసింది ఇండియన్ నేవీ. ఈ నెల 3, 4 తేదీలలో భారీ వర్ష సూచన నేపథ్యంలో నేవీ డే వేడుకలు వాయిదా పడ్డాయి. తుఫాన్‌ను ఎదుర్కునేందుకు ఫ్లడ్ రిలీఫ్, డైవింగ్ టీమ్స్, నెవల్ ఎయిర్ క్రాఫ్ట్స్, నేవల్ ఎయిర్ స్టేషన్స్ ,నేవల్ షిప్స్, మెడికల్ టీమ్స్ ను సిద్దంగా ఉంచేందుకు నేవీ డే ను వాయిదా వేసినట్టు ప్రకటించింది ఇండియన్ నేవీ. 1971 లో కరాచీ హార్బర్ పై ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో సాధించిన విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4 న నేవీ డేని నిర్వహిస్తుంటారు.

ఆంధ్రా వైపు దూసుకొస్తున్న మిచౌంగ్..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. మరోవైపు నేడు తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపటికి మిచౌంగ్ తుఫాను గా బలపడనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని, 5 వతేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు ఐఎండీ అధికారులు. రానున్న మూడు రోజులులో గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆంధ్ర ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఈదురు గాలులకు పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంల ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధమైంది.

లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ పై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం..

ఇంకోవైపు విశాఖ లో నేటి నుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ పైనా మిచౌంగ్ తుఫాన్ ప్రభావం పడనుంది. క్రికెట్ ప్రమోషన్ లో భాగంగా 70 మంది అంతర్జాతీయ వెటరన్ క్రికెటర్స్ తో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు పలు దేశాల వెటరన్ క్రికెటర్లు. నేటి నుంచి మూడు రోజుల పాటు టోర్నమెంట్ షెడ్యూల్ చేసినా మీచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి టోర్నమెంట్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..