Nani – Pawan Kalyan: వామ్మో… ఊహించని ట్విస్ట్.. పవన్ గురించి నాని ట్వీట్…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ హీరోలు ఆయనకు మద్దతు నిలువగా.. తాజాగా నాన్ మెగా ఫ్యామిలీ హీరో, నేచురల్ స్టార్ నాని పవన్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ వేశారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Nani - Pawan Kalyan: వామ్మో... ఊహించని ట్విస్ట్.. పవన్ గురించి నాని ట్వీట్...
Nani - Pawan Kalyan

Updated on: May 07, 2024 | 1:46 PM

కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్‌లు ఇప్పటికే ప్రచారం చేశారు. తాజాగా పవన్ పెద్దన్న, మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్‌కు ఓటెయ్యాలని వీడియో ద్వారా పిఠాపురం ప్రజలను అభ్యర్థించారు. ఇప్పటికిప్పుడు మరో నాన్ మెగా ఫ్యామిలీ హీరో.. నేచురల్ స్టార్ నాని పవన్‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు పవన్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ వేశారు.

‘ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈ పొలిటికల్ యుద్ధంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని సినిమా కుటుంబానికి చెందిన సభ్యుడిగా ఆశిస్తున్నా. నాతోపాటు మనవాళ్లు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అని నాని ట్వీట్‌లో రాసుకొచ్చారు. మెగా ఫ్యామిలీ కాకుండా బయట నుంచి పవన్‌కు సపోర్ట్ చేసిన పెద్ద  హీరో నానినే అని చెప్పాలి.

అటు జబర్దస్త్ కమెడియన్స్ అయిన..   హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి సెలబ్రిటీలు సైతం పవన్ కోసం పిఠాపురంలో కలియతిరిగారు.  ఇంకా చాలామంది సినీ, సీరియల్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.  2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్..  రెండు చోట్లా  ఓడిపోయారు. ఈ సారి పవన్ ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలన్నా పట్టుదలతో పని చేస్తున్నారు. అటు వైసీపీ పవన్‌ను ఓడించడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి నాయకులను రంగంలోకి దించి.. మండలాల వారీగా మొహరింపచేసింది. మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం వంటివారు అక్కడ వైసీపీ తరఫున యాక్టివ్‌గా పని చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి వంగా గీత పిఠాపురం బరిలో ఉన్నారు. రాష్ట్రంలో హై ఇంట్రస్ట్ ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి అని చెప్పవచ్చు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..