Andhra Pradesh: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్స్ బస్సు..!

Andhra Pradesh: తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్సు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు వెనుక టైరు నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ సుభాష్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కన..

Andhra Pradesh: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్స్ బస్సు..!
Busi Fire

Edited By:

Updated on: May 15, 2026 | 9:24 AM

Andhra Pradesh: విజయవాడ – చెన్నై జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

అసలేం జరిగింది?

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్సు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు వెనుక టైరు నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ సుభాష్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గ్రహించి, రెండో డ్రైవర్ సాయంతో నిద్రలో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించేశారు. ప్రయాణికులు వారి లగేజీని సురక్షితంగా కిందకు చేర్చిన కొద్దిసేపటికే.. టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది.

ఈ ట్రావెల్స్‌ బస్సులో తొలుత మొత్తం 36 మంది ప్రయాణీకులు ఉండగా కొంతమంది మార్గమధ్యంలో తమ గమ్యస్థానాల్లో దిగిపోయారు. మిగిలిన 10 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రంగంలోకి రవాణా శాఖ అధికారులు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కందుకూరు ఆర్టీఓ (RTO) అధికారిణి నాగలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్లు, డ్రైవర్ల లైసెన్సులను తనిఖీ చేశారు. ప్రాథమిక విచారణలో బస్సుకు అన్ని అనుమతులు ఉన్నాయని, నిబంధనల ప్రకారమే నడుస్తోందని ఆర్టీవో అధికారిణి నాగలక్ష్మి తెలిపారు.

ప్రాణాలు కాపాడిన డ్రైవర్

“వెనుక వైపు పొగలు రావడం గమనించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సు ఆపి అందరినీ కిందకు దింపేశాం. మేమందరం దిగిన కొద్దిసేపటికే మంటలు ఎగిసిపడి బస్సు కాలిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది” అని డ్రైవర్ సుభాష్ తెలిపారు.

 

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us