Nara Lokesh: నేటి నుంచి ప్రారంభం కానున్న యువగళం పాదయాత్ర.. ఈ నియోజకవర్గాల్లో పర్యటించనున్న నారా లోకేష్

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాల్టి నుంచి రెండో విడత యువ గళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి సోమవారం యాత్ర ప్రారంభం కానుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్‌తో సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Nara Lokesh: నేటి నుంచి ప్రారంభం కానున్న యువగళం పాదయాత్ర.. ఈ నియోజకవర్గాల్లో పర్యటించనున్న నారా లోకేష్
Nara Lokesh To Starts Yuvagalam Padayatra From Pudalada In Dr. B.r. Ambedkar Konaseema District

Updated on: Nov 27, 2023 | 10:52 AM

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాల్టి నుంచి రెండో విడత యువ గళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి సోమవారం యాత్ర ప్రారంభం కానుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్‌తో సెప్టెంబర్ 9న యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 209 రోజుల్లో 2852 కి.మీ పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్.. నేటి నుంచి 210 వ రోజు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈరోజు ఉదయం 10.19 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పొదలాడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు.

రాజోలు,పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యువ గళం పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ క్యాంప్ సైట్‌కు చేరుకున్నారు నారా లోకేష్. ఈరోజు సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం అయి, వారి కష్టాలను తెలుసుకొనున్నారు. గతంలో నిర్థేశించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఏర్పాటు చేయడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. మళ్లీ తిరిగి లోకేష్ జనంలోకి రావడంతో టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి