Nara Lokesh: నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో విచారణ

| Edited By: Shiva Prajapati

Oct 10, 2023 | 2:04 PM

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో భారీ అక్ర‌మాలు జ‌రిగాయంటుంది ఏపీ ప్ర‌భుత్వం. ఈ కేసులో చంద్ర‌బాబుతో పాటు నారా లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో లోకేష్ ను ఏ14 గా చేర్చింది సీఐడి. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్ర‌బాబు బినామీల‌కు ల‌బ్ది చేకూర్చే విధంగా వ్య‌వ‌హ‌రించార‌నేది సీఐడీ ఆరోప‌ణ‌. ప్ర‌ధానంగా లింగ‌మ‌నేని ర‌మేష్ ఇంటిని క్విడ్ ప్రోకో విధానంలో తీసుకున్నార‌ని సీఐడీ ఆరోపిస్తుంది.

Nara Lokesh: నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో విచారణ
Nara Lokesh
Follow us on

అమరావతి ఇన్న‌ర్ రింగ్ రోడ్ అక్ర‌మాల‌పై సీఐడి ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు నారా లోకేష్. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో లోకేష్ ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమ‌తిచ్చింది. అయితే విచార‌ణ స‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు కూడా ఫాలో కావాల‌ని సూచించింది. రింగ్ రోడ్డు కేసులో సీఐడి ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగినా స‌మాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని లోకేష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సీఐడీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి కుంచనపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం -2 కార్యాలయానికి వెళ్లనున్నారు లోకేష్.

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో A 14 గా ఉన్న లోకేష్

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో భారీ అక్ర‌మాలు జ‌రిగాయంటుంది ఏపీ ప్ర‌భుత్వం. ఈ కేసులో చంద్ర‌బాబుతో పాటు నారా లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో లోకేష్ ను ఏ14 గా చేర్చింది సీఐడి. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్ర‌బాబు బినామీల‌కు ల‌బ్ది చేకూర్చే విధంగా వ్య‌వ‌హ‌రించార‌నేది సీఐడీ ఆరోప‌ణ‌. ప్ర‌ధానంగా లింగ‌మ‌నేని ర‌మేష్ ఇంటిని క్విడ్ ప్రోకో విధానంలో తీసుకున్నార‌ని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉంద‌ని పేర్కొంది. లోకేష్ పార్ట‌న‌ర్ గా ఉన్న హెరిటేజ్ సంస్థ‌కు ల‌బ్ది చేకూరాల‌నే ఉద్దేశంతోనే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేసార‌ని చెబుతుంది. దీంతో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు సీఐడీ సిద్ద‌మైంది.

ముందుగానే నారా లోకేష్ హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ కు వెళ్లారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు లోకేష్ కు 41 ఏ నోటీసులు ఇచ్చి విచార‌ణ జ‌రిపాల‌ని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాల‌తో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చి ఈనెల 4న విచార‌ణ‌కు రావాల‌ని సూచించారు. విచార‌ణ‌కు వ‌చ్చే స‌మ‌యంలో హెరిటేజ్ సంస్థ‌ భూముల కొనుగోలుకు సంబంధించిన‌ ప‌లు డాక్యుమెంట్లు కూడా తీసుకురావాల‌ని పేర్కొన్నారు. దీంతో మ‌రోసారి నారా లోకేష్ హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసారు. హెరిటేజ్ సంస్థ‌లో లోకేష్ ఒక పార్ట‌న‌ర్ మాత్ర‌మేన‌ని. ఆ సంస్థ‌కు సంబంధించిన కీల‌క వివ‌రాలు లోకేష్ కు తెలియ‌దంటూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టులో వాద‌న‌లు వినిపించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార‌ణంగా లోకేష్ ను అరెస్ట్ చేయ‌వ‌చ్చ‌ని వాదించారు. అయితే డాక్యుమెంట్ల విష‌యంలో ఒత్తిడి చేయ‌బోమ‌ని సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాదులు వాదించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు నారా లోకేష్ ను ఈనెల 10 వ తేదీన సీఐడీ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. విచార‌ణ కు ప‌లు నిబంధ‌న‌లు కూడా పెట్టింది. ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే విచారించాల‌ని ఆదేశించింది. మ‌ధ్యాహ్నం ఒక గంట‌పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాల‌ని పేర్కొంది. లోకేష్ కు క‌నిపించేటంత దూరంలో న్యాయ‌వాది ఉండేలా విచార‌ణ చేయాల‌ని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాల‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం కుంచ‌న‌ప‌ల్లిలోని సీఐడీ ఆర్ధిక నేరాల విభాగం – 2 వ‌ద్ద లోకేష్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

హెరిటేజ్ కు ఎలాంటి మేలు జరగలేదు అంటున్న టీడీపీ

అసలు అమరావతి లో ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు. భూసమీకరణ కూడా చేయలేదు. అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని అంటున్నారు టీడీపీ నేతలు.హెరిటేజ్ సంస్థ కు దేశవ్యాప్తంగా భూములు ఉన్నాయని.. వ్యాపార విస్తరణ లో భాగంగా భూములు కొన్నారని.. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు ద్వారా హెరిటేజ్ కు చెందిన భూములు కూడా కోల్పోయినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా సీఐడీ కి లోకేష్ అందిస్తారని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..