ఇది ఖచ్చితంగా వారిపనే.. పర్యటన అడ్డుకున్న ఘటనపై చంద్రబాబు

| Edited By:

Feb 28, 2020 | 4:38 AM

చంద్రబాబు విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు. అయితే ఏపీ సర్కార్ చేసిన ఈ వ్యవహారంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విశాఖ, విజయనగరంలో యాత్రకు పర్మిషన్ అడిగితే.. ఎన్నో ఆంక్షలు పెట్టిన పోలీసులు.. విమానాశ్రయం వద్దకు వైసీపీ కార్యక్ర్తలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఆందోళనకారుల ముసుగులో […]

ఇది ఖచ్చితంగా వారిపనే.. పర్యటన అడ్డుకున్న ఘటనపై చంద్రబాబు
Follow us on

చంద్రబాబు విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు. అయితే ఏపీ సర్కార్ చేసిన ఈ వ్యవహారంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

విశాఖ, విజయనగరంలో యాత్రకు పర్మిషన్ అడిగితే.. ఎన్నో ఆంక్షలు పెట్టిన పోలీసులు.. విమానాశ్రయం వద్దకు వైసీపీ కార్యక్ర్తలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఆందోళనకారుల ముసుగులో వచ్చిన వైసీపీ కార్యకర్తలను.. నియంత్రించకుండా.. తనను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనంటూ ట్వీట్ చేశారు.

హుద్ హుద్ తుఫాన్ బీభత్సంతో చెల్లాచెదురైన విశాఖ ఎయిర్ పోర్ట్‌ను.. టీడీపీ హయాంలో మేమే దగ్గరుండి పునర్నిర్మించామని.. ఎంతో సుందరంగా ఎయిర్ పోర్ట్‌ను రూపొందించడంతోపాటు, మొత్తం విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దామన్నారు. అదే ఎయిర్ పోర్ట్ వద్ద నన్ను అడ్డుకోవడం, గంటల తరబడి నిలిపేయడం విశాఖవాసులు ఎవరూ కూడా చేయరన్నారు. ఇదంతా ఖచ్చితంగా వైసీపీ అరాచక శక్తుల పనే..అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

“నా పర్యటన అడ్డుకునేందుకు ఇతర జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరలించడం హేయమైన చర్యఅని.. పోలీసుల అనుమతి ఉన్నా యాత్రను అడ్డుకున్నారంటే, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందన్నారు. వైసీపీ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని.. ఈ దుర్మార్గాన్ని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు నిరసించాలన్నారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌! సేవ్‌ డెమొక్రసీ” అంటూ ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.