Andhra News: సచివాలయం వాష్‌రూమ్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏంటని వెళ్లి చూడగా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో ఉద్యోగి మధుశేఖర్ గొంతు కోసుకొని అత్మహత్యయత్నంకు పాల్పడటం కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఉద్యోగి మదుశేఖర్ ను సహచర ఉద్యోగులు చికిత్స కొరకు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: సచివాలయం వాష్‌రూమ్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏంటని వెళ్లి చూడగా..
Andhra News

Edited By:

Updated on: Jan 28, 2026 | 10:24 PM

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి మధుశేఖర్ గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి ఉద్యోగులు మధును వెంటనే హాస్పిల్‌కు తరలించి.. చికిత్స అందించారు. బాదితుడి బంధవులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మల్లమ్మ, చిన్న బాలయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు,పెద్ద కుమారుడైన మధు శేఖర్ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. గోస్పాడు మండలం నెహ్రూ నగర్ లో ఆరు సంవత్సరాలు విధులు నిర్వహించిన మదుశేఖర్ గత సంవత్సరం జరిగిన బదిలీలలో బిల్లలాపురంలో విధులు నిర్వహిస్తూన్నారు.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సచివాలయం పైన ఉన్న బాత్ రూమ్‌కని వెళ్లిన మధుశేఖర్ ఎంత సేపటికి రాకపోవడం అనుమానం వచ్చిన తోలి ఉద్యోగులు పైకి వెళ్ళి చూశారు. అక్కడ అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడిపోయి ఉన్న మధును చూసి షాక్ అయ్యారు. వెంటనే అంబులెన్స్ సహాయంతో మధుశేఖర్ ను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కత్తితో చెయ్యి, గొంతును కోసుకొని అత్మహత్యయత్నం పాల్పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కొరకు కర్నూలు తరలించారు.

ఉద్యోగి మధుశేఖర్ కత్తితో గొంతు, చెయ్యి కోసుకొని అత్మహత్యయత్నం పాల్పడటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అత్మహత్యయత్నంకు ప్రేమ వ్యవహారమా,అర్థిక ఇబ్బందులా, మరే ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూన్నారు. అత్మహత్యకు పాల్పడాలని అనుకున్నప్పుడు ఎందుకు సచివాలయంలో చేసుకున్నాడు అనేది అందరికి సందేహాలు కలుగుతున్నాయి. పోలీసులు మాత్రం అప్పులు ఎక్కువ కావడంతో అత్మహత్యయత్నం పాల్పడ్డారు అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.