Andhra News: అయ్యో ఎంతకష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను కాల్వలో తోసి.. తల్లి ఆత్మహత్య!

నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసేసి ఆనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Andhra News: అయ్యో ఎంతకష్టమొచ్చిందో పాపం.. ఇద్దరు పిల్లలను కాల్వలో తోసి.. తల్లి ఆత్మహత్య!
Nandyal Tragedy

Updated on: Dec 28, 2025 | 8:37 PM

తన ఇద్దరు పిల్లల్ని కాలువలో తోసేసి.. ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒండుట్లకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ వైష్ణవి (4) సంగీత (5) అనే ఇద్దరు పిల్లలతో కలిసి గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని శ్రీశైలం కుడి కాలువ దగ్గరకు వెళ్లింది. మొదటగా తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసేసి.. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య కు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలువలోంచి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.