Nandigama: ఆటో స్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా ప్రయాణికుడు.. అతని బ్యాగ్ చెక్ చేయగా

|

Aug 22, 2024 | 2:55 PM

ఆ లారీ క్లీనర్ ఎంతో నమ్మకస్థుడు. అందుకే ఆ డ్రైవర్.. ఎటు వెళ్లాలన్నా అతడినే పిలుస్తాడు. కానీ ఈ సారి లక్షల్లో సొమ్ము చూసేసరికి ఆ క్లీనర్‌కు దుర్భుద్ది పుట్టింది. ఆ తర్వాత....

Nandigama: ఆటో స్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా ప్రయాణికుడు.. అతని బ్యాగ్ చెక్ చేయగా
Nandigama
Follow us on

ఇప్పుడు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ డబ్బు కోసం ఎలాంటి పాడు పనులు చేసేందుకు వెనకాడటం లేదు. ఆస్తి కోసం కన్న తల్లితండ్రులను, తోడబుట్టినవాళ్లను కూడా చంపుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా లక్షల్లో డబ్బు చూసేసరికి ఓ లారీ క్లీనర్‌కు దుర్బుద్ది పుట్టింది. ఆ సొమ్మునంతా తీసుకుని.. డ్రైవర్‌ను చీట్ చేసి పరారయ్యాడు. అయితే డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సదరు క్లీనర్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ సమీపంలో ఈ ఘటన జరిగింది.

తెలంగాణలోని మధిర నుంచి ఆగస్టు 17న లారీలో 300 బస్తాల మిర్చిని ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ తీసుకెళ్లారు. అక్కడ మిర్చి అమ్మిన తర్వాత  లారీ డ్రైవర్‌ షేక్‌ ఖయ్యూం.. ఆ డబ్బు తీసుకుని క్లీనర్‌ పల్లెపోగు కోటేశ్వరరావుతో కలిసి తిరిగి బయల్దేరాడు. దారిలో క్లీనర్‌ రూ.18.52లక్షలతో చప్పుడుకాకుండా పరారయ్యాడు. దీంతో డ్రైవర్ సమీపంలోని..  నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలెర్టైన పోలీసులు.. వెహికల్స్ చెకింగ్స్ చేపట్టారు. ఈ సమయంలోనే నందిగామ ఆటో స్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న క్లీనర్‌ కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడి నుంచి రూ.18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ  ఏసీపీ రవికిరణ్‌ మీడియా తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..