ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం..

కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైక్‏ను అడిషనల్ డీజీపీ కారు ఢికొట్టింది.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం..

Updated on: Dec 07, 2020 | 11:33 AM

Krishna: కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలాకు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైక్‏ను అడిషనల్ డీజీపీ కారు ఢికొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రహదారి పక్కన గల కందకంలోకి డీజీపీ కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బైక్ పై ఉన్న వ్యక్తి కంచిక చర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహరావుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాటి ఉజేలా సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఆయనను వేరే కారులో తరిలించారు సెక్యూరిటీ సిబ్బంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us