AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్ట్ సమన్లు.. ఈనెల 28న హాజరు కావాలని ఆదేశం

|

Mar 24, 2022 | 12:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.

AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నాంపల్లి కోర్ట్ సమన్లు.. ఈనెల 28న హాజరు కావాలని ఆదేశం
Cm Jagan
Follow us on

Summons to AP YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్(Hyderabad) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2014లో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నిలక నియమావళిని ఉల్లంఘించారనే అభియోగంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీఎం జగన్‌కు సమన్లు జారీ చేసింది.

2014లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం జగన్ హాజరుకావాలని నాంపల్లి ఎంపీ , ఎమ్మెల్యే ప్రత్యేక కోర్ట్ సమన్లు జారీ చేసింది. కాగా, మొదటిసారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయడం విశేషం.

Read Also….  Optical Illusions: ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోపై ఓ లుక్కేయండి.. మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయి..