MLA Roja Selvamani: వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసమ్మతి సెగ వెంటాడుతోంది. 2019 ఎన్నికల నాటి నుంచి నగరి వర్గ పోరులో నెట్టుకొస్తున్న ఎమ్మెల్యే ఆర్.కె.రోజా గత కొద్ది కాలంగా సమ్మతి వర్గాన్ని దీటుగానే ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తనకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాన్ని ఖంగు తినిపించిన రోజా పార్టీ హైకమాండ్ వద్ద తనదే పైచేయిగా నిరూపించారు. ఈ నేపథ్యంలోనే వ్యతిరేక వర్గాలన్నీ ఒక్కటయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు రోజా వ్యతిరేక వర్గంగా పేరున్న నేతలు నగరి కేంద్రంగా సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈనెల 21న సీఎం జగన్ జన్మ దిన వేడుకలు నిర్వహించే పేరిట ఎమ్మెల్యే రోజా భర్త ఆర్ కె సెల్వమణి, అసమ్మతి వర్గాలు వేర్వేరుగా నిన్న ఆత్మీయ సమావేశాలు నిర్వహించాయి. మున్సిపల్ మాజీ అధ్యక్షుడు కేజే కుమార్, ఆయన భార్య రాష్ట్ర ఈడిగ కార్పొరే షన్ చైర్పర్సన్ కే.జే శాంతి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడలమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, విజయపురం నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు సమావేశానికి హాజరయ్యారు.
ఎమ్మెల్యేతో కలిసి కాకుండా ప్రత్యేకంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరిలో లేదంటే పుత్తూరులో నిర్వహించాలా అన్నదానిపై నిర్ణయించుకోనున్నారు. ఎమ్మెల్యే నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆత్మీయ సమావేశంలో చర్చించిన అసమ్మతి నేతలు రోజా ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఆది నుంచి పార్టీకి పని చేస్తున్న నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో నిండ్ర, విజయపురం మండ లాల్లో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును ప్రత్యే కంగా ప్రస్తావించిన అసమ్మతి వర్గం ఎన్నికల్లో పార్టీకి కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని అందలం ఎక్కించి నగిరి లో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రమంతా వైసీపీ అధికారంలో ఉంటే నగరిలో మాత్రం టిడిపి నాయకుల పాలన సాగుతోందని రోజాను కార్నర్ చేసిన కేజే కుమార్ రోజాతో అమిత్ వీక్లీ తీసుకునేందుకు సిద్ధమన్నట్లు ఆరోపణలు చేశారు. భవిష్యత్తులోనూ సమావేశమై కార్యకలాపాలను విస్తృతం చేసి రోజాపై పార్టీ ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని అసమ్మతి నేతలు సంకల్పించగా ఎమ్మెల్యే భర్త సెల్వమణి నిర్వహించిన సమావేశంలో మాత్రం కేవలం ముఖ్యమంత్రి జన్మదిన ఏర్పాట్లపైనే చర్చించారు. ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా ఉన్న వర్గం ముఖ్యమంత్రి జన్మదిన ఉత్సవాలను వేడుకగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. సీఎం బర్త్ డేను ఘనంగా జరపాలని ఎమ్మెల్యే రోజా దృష్టిసారిస్తుంటే పార్టీలోనే ఉంటూ, పార్టీకి ద్రోహం చేయడం సహించేది లేదని రోజా అనుకూలవర్గం ఆరోపిస్తోంది. దీంతో మరోసారి తెర మీదికి వచ్చిన నగరి అసమ్మతి పంచాయతీ సీఎం బర్త్ డే వేడుకల్లో రచ్చ రాజేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :