Nagari MLA Roja: అపోలో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా.. విజయవంతమైన రెండు ఆపరేషన్లు..

చెన్నై అపోలో అస్పత్రిలో నగరి ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు జరిగాయి. ఆపరేషన్ అనంతరం ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు వైద్యులు.

Nagari MLA Roja: అపోలో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా.. విజయవంతమైన రెండు ఆపరేషన్లు..
Nagari Mla Roja

Edited By: Ram Naramaneni

Updated on: Mar 29, 2021 | 4:34 PM

MLA Roja Health Condition: నగరి ఎమ్మెల్యే రోజా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు సర్జరీలు జరిగినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసీయూ నుంచి సోమవారం ఉదయం వార్డుకు తరలించారని చెప్పారు. మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు.

ఇది వరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని.. కానీ గతేడాది కరోనా వ్యాప్తి నేపత్యంలో వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు. మరోసారి జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా వేశారని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని.. కోవిడ్ వ్యాప్తి చెందుతున్నందున అభిమానలు కానీ నియోజక వర్గ ప్రజలు ఎవ్వరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.

నగరి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరికీ ఆందోళన వద్దన్నారు. రోజా ఏ సర్జరీలు చేయించుకున్నారన్నది తెలియాల్సి ఉంది. అభిమానుల పూజల ఫలితంగా రెండు ఆపరేషన్లు సక్సెస్ అయినట్లుగా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు సెల్వమణి.

ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం గురించి ఆమె భర్త సెల్వమణి మాటల్లో…

 

ఇవి కూడా చదవండి: ఈ లోహం బంగారం కంటే మూడు రెట్లు ఎక్కువ విలువైనది..! ప్లాటీనం కాదు..! బిట్‌కాయిన్‌ను మించిపోయింది..!

LIC Alert: పాలసీదారులకు ముఖ్య గమనిక..! అలాంటి ఎస్ఎంఎస్ వస్తే స్పందించకండి..!