Andhra News: అప్పట్లో దేవకన్యలు స్నానం చేసిన కొలను ఇదేనట.. ఎక్కడుందో తెలుసా?

ఎవరైనా పూర్వపు చరిత్రల గురించి చెప్తుంటే అలానే వినాలనిపిస్తుంది.. దానిలో పాటు వాటి గురించి మరింత తెలుసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి సంఘటనే ఇది కూడా.. పూర్వకాలంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భూమి మీదకు వచ్చే దేవకన్యలు పవిత్ర కొలనులో స్నానం చేసి.. అమ్మవారిని పూజించి వెళ్లేవారట.. అలా వారు స్నానం చేసిన కొలను ఒకటి ప్రస్తుతం బయటపడింది. ఈ కొలను ఇప్పటికీ నీటితో నిండి ఉంది.. ఇంతకూ అది ఎక్కడుందనేగా మీ డౌట్‌ తెలుసుకుందాం పదండి.

Andhra News: అప్పట్లో దేవకన్యలు స్నానం చేసిన కొలను ఇదేనట.. ఎక్కడుందో తెలుసా?
Kadapa District

Edited By: Anand T

Updated on: Nov 15, 2025 | 4:30 PM

ఎవరైనా పూర్వపు చరిత్రల గురించి చెప్తుంటే అలానే వినాలనిపిస్తుంది.. దానిలో పాటు వాటి గురించి మరింత తెలుసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి సంఘటనే ఇది కూడా.. పూర్వకాలంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భూమి మీదకు వచ్చే దేవకన్యలు పవిత్ర కొలనులో స్నానం చేసి.. అమ్మవారిని పూజించి వెళ్లేవారట.. అలా వారు స్నానం చేసిన కొలను ఒకటి ప్రస్తుతం బయటపడింది. చరిత్ర చెప్పిన ఆధారాల ప్రకారం.. ఇక్కడ అక్కదేవతలుగా పిలవబడే దేవకన్యలు వచ్చి స్నానం ఆడి అమ్మవారిని కొలిచేవారంట. ఈ కొలను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కన్నె తీర్థం దేవాలయంలో ఉంది.

సప్తమాతృక కన్య తీర్థంగా పిలవబడే ఈ దేవాలయంలో అమ్మవారి దేవాలయం వెనుక భాగంలో ఉన్న కొలనులో అక్కదేవతలుగా పిలవబడే బ్రాహ్మి, మహేశ్వరి, చాముండి, వారాహి, ఇంద్రాణి, వైష్ణవి, కోముది అనే అక్కదేవతలు నిత్యం భూమి మీదకు వచ్చి కన్ని తీర్థంలోని కొలనులో స్నానం చేసి అమ్మవారిని పూజించేవారనేది చరిత్ర చెబుతున్న కథ. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండేవని గ్రంథాలు చెబుతున్నాయి. అక్కదేవతలు భూమి మీదకు వచ్చి పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించేవారని.. వీరు జలకాలాడే కొలను వద్ద పసుపు కుంకుమకు సంబంధించిన ముద్దలు కూడా ఉండేవని ప్రతిదీ.

అయితే కాలక్రమేనా అవి కనపడనప్పటికీ ప్రస్తుతం ఆ కొలనులోని నీటితోనే అమ్మవారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కన్య తీర్థం దేవాలయం కార్తీక మాసంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో మహిళలు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. సంతానం లేని వారు పెళ్లి కావలసినవారు ఇక్కడ పూజలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.