Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను వింత వ్యాధి హడలెత్తిస్తోంది. తాజాగా ఏలూరు ప్రాంతంలో మరోసారి వింత వ్యాధి కలకలం రేగింది. ఏలూరులో ఓ వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఫిట్స్‌తో కిందపడి కొట్టుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆంబులెన్స్‌కు కాల్ చేశారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని బాధిత వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. బాధిత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని.. రిపోర్టులు వచ్చాక ఏ కారణం చేత అతనికి అలా జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఏలూరులో మరోసారి వింత వ్యాధి లక్షణాలు కనిపించడంలో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. అధికారులు దీనిపై దృష్టిసారించాలని కోరుతున్నారు.
Also read:
ఓట్ల గల్లంతు విచారణ మళ్లీ రేపటికి వాయిదా.. పిటిషనర్‌కు ఓటు హక్కే లేదన్న ఎస్‌ఈసీ తరపు న్యాయవాది