ఓట్ల గల్లంతు విచారణ మళ్లీ రేపటికి వాయిదా.. పిటిషనర్‌కు ఓటు హక్కే లేదన్న ఎస్‌ఈసీ తరపు న్యాయవాది

పీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపథ్యంలో 2019 నాటి ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నారంటూ..

ఓట్ల గల్లంతు విచారణ మళ్లీ రేపటికి వాయిదా.. పిటిషనర్‌కు ఓటు హక్కే లేదన్న ఎస్‌ఈసీ తరపు న్యాయవాది
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:55 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపథ్యంలో 2019 నాటి ఓటర్ల జాబితా ఉపయోగిస్తున్నారంటూ గుంటూరుకు చెందిన విద్యార్థిని నిఖిల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.

పాత జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా ఓటు హక్కు పొందిన 3.6 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరుగుతోందని విద్యార్థిని అఖిల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వారందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి వస్తుందని అఖిల తన పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే ఆ పిటిషనర్ వాదన అర్థరహితమని ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఓటు కోసం దరఖాస్తే చేయలేదని వెల్లడించారు. ఆ పిటిషన్ ను కొట్టివేయాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దాంతో పూర్తి వివరాలతో రేపు వాదనలను వినిపిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. విచారణను రేపటికి వాయిదా వేశారు

తెలంగాణలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం.. ప్రభుత్వంపై ఉద్యమించి డిమాండ్లు సాధించుకోవాలని ఉత్తమ్‌ పిలుపు

టీడీపీ పంచాయతీ మేనిఫెస్టో విడుదల.. ప్రజామోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు