AP News: పాము తల కోసి లైవ్‌లో మణి తీశాడు.. వీడియో చూడండి..

|

Dec 21, 2024 | 8:29 AM

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో పాము రాళ్ల అమ్మకాలు కలకలం రేపాయి. పాము రాళ్ల పేరుతో అమాయక రైతులను నమ్మించి డబ్బులు స్వాహా చేశారు ఇద్దరు కేటుగాళ్లు. ఇంతకీ... ఏంటీ.. పామురాళ్లు?.. వాటిని అమ్మిందెవరు?.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి...

AP News: పాము తల కోసి లైవ్‌లో మణి తీశాడు.. వీడియో చూడండి..
Snake
Follow us on

ప్రజల అమాయకత్వాన్ని క్యాష్‌ చేసుకునే వాళ్లను చూశాం.. ఇప్పుడు ప్రజల భయాన్ని కూడా కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. ముమ్మిడివరం పరిధిలోని కేశనపర్రులో పాము రాళ్లు అంటూ ఇద్దరు మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించారు. పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విష సర్పాలు దరిచేరవని జోరుగా ప్రచారం చేశారు. పాములు, తేళ్లు, జెర్రెలు కుట్టిన ప్రదేశంలో పాము తల నుంచి తీసిన రాయి ఉంచితే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి పొలాల్లో పనులు చేసుకునే రైతులను, కూలీలను నమ్మించారు. గ్రామాల్లో పాములను పట్టి.. రైతుల సమక్షంలో వాటి తలలో ఉన్న రాళ్లను తీసి నమ్మబలికి అమ్మేశారు ఇద్దరు వ్యక్తులు.

రైతుల ముందే ఓ పాము నుంచి రెండు రాళ్లను తీసిన మోసగాళ్లు.. ఒక్కొక్క రాయిని 500 నుంచి 1000 రూపాయలకు అమ్మారు. ఈ సందర్భంగా.. ఆడపాము తలలో నాలుగు రాళ్లు, మగ పాము తలలో రెండు రాళ్లు ఉంటాయని చెప్పారు. పాములు, విష పురుగుల ప్రమాదం నుంచి బయటపడొచ్చనే ప్రచారంతో వారి మాటలు నమ్మిన పలువురు రైతులు ఎగబడి మరీ పాము రాళ్లు కొనుగోలు చేశారు. అయితే.. పాము తలలో రాళ్లు అనే ప్రచారం మోసం అంటున్నారు స్నేక్ క్యాచర్స్‌. వారే ఆ రాళ్లు పెట్టి.. తల నుంచి తీసినట్లుగా మోసానికి పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాము తలలో రాళ్ల పేరుతో రైతులను మోసం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..