Mudragada Padmanabham: మీ వల్ల ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం.. చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ

Mudragada Padmanabham: ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ప్రతిపక్షాల ధర్నాలు, విమర్శలు, ఆందోళనల మధ్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇక..

Mudragada Padmanabham: మీ వల్ల ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం.. చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ
Follow us

|

Updated on: Nov 23, 2021 | 11:33 AM

Mudragada Padmanabham: ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ప్రతిపక్షాల ధర్నాలు, విమర్శలు, ఆందోళనల మధ్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇక తాజాగా చంద్రబాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. జరిగిన అవమానం గురించి చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను. నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది. మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య చేసుకోవడం విమరించుకున్నాను. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం దీక్ష ప్రారంభిస్తే అవమానించారు. ఇంటి తలుపులు

ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా.. అంటూ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. చంద్రబాబు పుత్రరత్నం తరచూ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారు. రాజమండ్రి ఆసుపత్రిలో మమ్మల్ని 14 రోజులు నిర్భంధించి రాక్షసానందం పొందారు. శపథాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం. చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం నీటిమీద రాత అని గ్రహించాలి. జీవితాలు, ఆస్తుల, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదు అంటూ లేఖలో పేర్కొన్నారు.

మీరు చేసిన హింస తాలుక అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం. అణిచివేత తో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? అని లేఖలో వ్యాఖ్యానించారు. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు.. మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది అంటూ లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.

Mudragada Latter

ఇవి కూడా చదవండి:

Heavy Rains: కడప జిల్లాల్లో 40కి చేరిన మృతుల సంఖ్య.. మృతదేహాల కోసం గాలింపు చర్యలు..!

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ సర్కార్ కొత్త నాటకం.. మరో బిల్లు తెస్తామంటూ గందరగోళంః జనసేనాని

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.