
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ముద్రగడ పద్మనాభంను జాయిన్ చేశారు. వెంటనే ఆయనకు చికత్స ప్రారంభించారు వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతకుముందు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలని వారికి ముద్రగడ సూచించారు. ఈ క్రమంలో.. స్థానిక వైద్యుల సూచన మేరకు ముద్రగడను హుటాహుటిన కాకినాడ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ యశోదకి తరలించాల్సి ఉన్నా.. వైద్యుల సూచన మేరకు కాకినాడ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. కాకినాడ మెడికవర్ హాస్పిటల్‌లో ముద్రగడకు చికిత్స కొనసాగుతోంది.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభంను కుమార్తె క్రాంతి పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
గత కొన్ని రోజులుగా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతికి.. తండ్రికి విభేదాలు కొనసాగుతున్నాయి.. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కాకినాడ తండ్రి నీ పరామర్శించడానికి కూతురు క్రాంతి వచ్చారు. అయితే.. క్రాంతిని పద్మనాభం ఉన్న రూంకు హాస్పిటల్ సిబ్బంది పంపించడంతో.. హాస్పిటల్ సిబ్బందిపై అయిన కుమారుడు ముద్రగడ గిరి సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా ముద్రగడ దగ్గరికి ఎవరిని పంపించొద్దని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..