Anantapur District: లేడీ కానిస్టేబుల్‌కు MPDO వేధింపులు…!

లేడీ కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడనే విషయం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా ఆమడగూరు...

Anantapur District: లేడీ కానిస్టేబుల్‌కు MPDO వేధింపులు...!
Mpdo Harrasement

Updated on: Jul 15, 2021 | 11:43 AM

లేడీ కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడనే విషయం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా ఆమడగూరు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ… ఎంపీడీవో మనోహర్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఎంపీడీవో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో అందరి ముందు తనను చెప్పలేని మాటల అన్నారని చెప్పింది భవానీ.

ఎంపీడీవో మనోహర్… తన ఆఫీస్‌లో ఓ మీటింగ్ పెట్టారు. దానికి కానిస్టేబుల్ భవానీ కూడా రావాల్సి ఉంది. అయితే… భవానీ దిశ యాప్స్‌ డౌన్‌లోడ్‌ విషయంలో బిజీగా ఉండి.. లేట్‌గా మీటింగ్‌కు వచ్చింది. దీంతో ఎంపీడీవో మనోహర్ సీరియస్ అయ్యారు. మీటింగ్‌కు వచ్చిన వారందరి ముందు… బయటకు చెప్పలేని మాటలు అన్నారని భవానీ వాపోయింది. ఓ మహిళను అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని భవానీ ఆరోపించింది.

దీనిపై లేడీ కానిస్టేబుల్.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో… ఎంపీడీవో మనోహర్‌ను ఎస్సై హైమావతి స్టేషన్‌కు పిలిపించింది. ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చింది. మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై మందలించింది. ఇకపై ఇలాంటివి రిపీట్ కావొద్దని గట్టిగా హెచ్చరించింది ఎస్సై. ఎంపీడీవోతో.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేయించింది. గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి… మహిళను వేధించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఎంపీడీవో మనోహర్‌బాబు…తన ఆఫీస్‌ స్టాఫ్‌, లేడీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌తోనూ ఇలాగే అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది.

Also Read: హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జిల్లాలలో కూడా.. రానున్న గంటల్లో భారీ వర్ష సూచన

కుమార్తెకు ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. పాపం భార్యకు తెలీదు.. ఒకరోజు ఏం జరిగిందంటే..?