Raghu Rama krishna Raju meets Rajnath Singh: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు రఘురామరాజు రాజ్‌నాథ్‌తో సమావేశమై ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఏపీ సీఐడీ అరెస్టు అనంతరం జరిగిన పలు సంఘటనలపై రఘురామకృష్ణరాజు పూర్తిగా వివరించినట్లు పేర్కొంటున్నారు. కాగా.. రఘురామకృష్ణరాజు నడవకూడదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆయన వీల్ చెయిర్‌లోనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగంపై ఏపీ సీఐడీ రఘురామకృష్ణరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిరోజులు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం అందించారు. కాగా.. సీఐడీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఎంపీ రఘురామ చేసిన ఫిర్యాదు అనంతరం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు నివేదిక అందించిన విషయం తెలిసిందే. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం రఘురామకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. విడుదల అనంతరం ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు.
Also Read: