Raghu Rama Krishna Raju: ఆర్మీ ఆసుపత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్‌.. నేరుగా ఢిల్లీకి పయనం..

|

May 26, 2021 | 12:51 PM

Secunderabad army hospital: నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. ర‌ఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju: ఆర్మీ ఆసుపత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్‌.. నేరుగా ఢిల్లీకి పయనం..
Raghu Rama Krishnam Raju
Follow us on

Secunderabad army hospital: నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. ర‌ఘురామకృష్ణరాజు అనారోగ్యం నుంచి కోలుకోవ‌డంతో.. ఆయ‌న‌్ను వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంత‌రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని రఘురామ ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామకృష్ణం రాజుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. అనంతరం ఆయన్ను అరెస్ట్‌ చేసి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త‌న‌ను సీఐడీ పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేశార‌ని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రాఘురామ‌కృష్ణ‌రాజుని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆర్మీ ఆసుపత్రి నివేదిక అనంత‌రం సుప్రీం బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ చేసింది. ఈ సందర్భంగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. ఎంపీ ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు సుప్రీం వెల్లడించింది. అయితే.. రెండు రోజుల విశ్రాంతి అనంతరం రఘురామ ఈ రోజు డిశ్చార్జ్‌ అయ్యారు.

Also Read:

Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..

Lottery: కాలదన్నుకున్నా.. ఆ మహిళకే వరించిన 7 కోట్ల లాటరీ.. అసలేం జరిగిందంటే..?