Vijayawada: టీడీపీ లీడర్, ఎంపీ కేశినేని నాని తనకు అన్యాయం చేశారంటూ ఆయన సొంత బాబాయ్ నాగయ్య ఆందోళనకు దిగారు. కేశినేని భవన్ పక్కన తన బిల్డింగ్ నిర్మాణం నిలిపేయాలని టౌన్ ప్లానింగ్ నోటీసులు పంపారని, దీనికి కారణం ఎంపీ కేశినేని నాని నే అని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అధికారులను ఉసిగొల్పి అక్రమ నోటీసులు ఇప్పించాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. తాను ఊర్లో లేనప్పుడు నోటీసులు జారీ చేశారని, ఇది దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగయ్య. కేశినేని నాని దుర్మార్గుడు అని, తన ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని నాని చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని నాగయ్య ఆందోళనకు దిగారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు తనగోడు పట్టించుకోవడం లేదని నాగర్య ఆవేదన వ్యక్తం చేశారు.