AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: పశువు కంటే హీనం.. అందుకే తల్లి వీడ్ని కడతేర్చింది…

సమాజం తల దించుకునేలా జన్మనిచ్చిన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భవిష్యత్తులో కూడా కొడుకుతో ఈ ముప్పు తప్పదని భావించిన తల్లి అతడిని అంతమొందించింది. తాడంకిలో తాపీమేస్త్రీ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

Krishna District: పశువు కంటే హీనం.. అందుకే తల్లి వీడ్ని కడతేర్చింది...
Rambabu
Ram Naramaneni
|

Updated on: Jul 19, 2024 | 11:24 AM

Share

పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో తల్లితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తల్లి భరించలేకపోయింది. ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి.. కన్న కొడుకునే అంతమొందించింది. రెండుళ్లుగా కొడుకుతో వేగలేకపోతున్నానని.. మానసిక క్షోభను అనభవించినట్లు ఆ తల్లి వాపోయింది. ఇక అతడి తీరు మారదని భావించి.. పచ్చడి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు దర్యాప్తులో అంగీకరించింది. కేసుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసులు గురువారం వెల్లడించారు.

తాడంకికి చెందిన గండికోట పద్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రాంబాబుకు ఇంకా పెళ్లి కాలేదు. కూలి పనులకు వెళ్తుంటాడు. అతడు కొంతకాలానికి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో… తల్లితో కూడా తప్పుగా ప్రవర్తించేవాడు. ఈ నెల 16న రాత్రి ఇంటికి వచ్చి లిక్కర్ సేవించాడు. ఆ మత్తులో తల్లితో తప్పుగా ప్రవర్తించగా.. ఆమె భయంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కొడుకుతో ఎప్పటికైనా ఈ ముప్పు ఉందని భావించిన ఆమె రాత్రి రెండు గంటల సమయంలో తిరిగొచ్చి మత్తులో మంచంపై పడుకుని ఉన్న కొడుకుని పచ్చడి బండతో తలపై బలంగా కొట్టి హతమార్చింది. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు పద్మ నవారుతాడుతో కాళ్లు, చేతులు కట్టేసుకొని…  కొడుకుని ఎవరో హత్య చేసినట్లు కట్టుకథ అల్లింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తులో నేరాన్ని అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన పచ్చడి బండ స్వాధీనం చేసుకొని.. నిందితురాలిని అరెస్టు చేశారు పోలీసులు. 24 గంటల్లో హత్య కేసు ఛేదించినందుకు పమిడిముక్కల పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!