Andhra: కొడుకు మరణవార్త తెలిసి ఆగిపోయిన తల్లి గుండె.. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు

లోకంలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. పిల్లలు ఎంత ఎదిగినా అమ్మకు ఎప్పటికీ చిన్న పిల్లలుగానే కనిపిస్తారు. వారు కొద్దిసేపు కనిపించకపోతేనే తల్లి గుండె అల్లాడిపోతుంది. అలాంటిది ఆ కొడుకు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడు అంటే ఏ తల్లి తట్టుకోలేదు. తాజాగా కొడుకు ఇక లేడన్న వార్త విని.. ఆ తల్లి గుండె ఆగింది..

Andhra: కొడుకు మరణవార్త తెలిసి ఆగిపోయిన తల్లి గుండె.. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు
Smihachalam -Somulamma

Edited By:

Updated on: Apr 10, 2025 | 4:42 PM

బిడ్డ కడుపులో పడిన విషయం తెలిసిన వెంటనే..  తల్లి మనసు ఎక్కడ లేనంత ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నవ మాసాలు కడుపున మూసి.. ఆ బిడ్డ రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. కాన్పు తర్వాత తొలిచూపు చూసేందుకు వేచి చూస్తూ ఉంటుంది. పంటి బిగువున బాధను ఓర్చుకొని.. కాన్పు జరిగిన తర్వాత తన బిడ్డను చూసుకొని మురిసిపోయి వాటిలో తన బాధనంత మర్చిపోతుంది ఆ తల్లి. పొత్తిళ్లలో పెట్టుకుని.. మమకారాన్ని పంచుతుంది. అంతేకాదు.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆలనా పాలనా చూస్తూ ఉంటుంది. కడదాకా తన బిడ్డకు ఏ హాని జరగకుండా ఉండాలని తల్లి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. చిన్న హాని జరిగిన ఆ గుండె తట్టుకోలేదు. అది తల్లి ప్రేమ అంటే. అందుకే కళ్ళ ముందు కొడుకుకు ఏదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది ఏ అమ్మి అయినా. చిన్న హాని జరిగితేనే అంతలా ఆవేదన చెందే ఆ తల్లి.. ఇక కళ్ల ముందు కొడుకు ప్రాణాలు పోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలా అల్లూరి జిల్లాలో తన కళ్ల ముందు కొడుకు గుండె ఆగిపోవడంతో తట్టుకోలేని ఆ తల్లి తనువు చాలించింది. లగిసిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసిపల్లి గ్రామంలో లకే సింహాచలం పాత్రుడు(50) కుటుంబంతో కలిసి నివశించేవాడు. అతను ఇటీవల ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది అతని తల్లి సోములమ్మ. కొడుకు ప్రాణాలు కోల్పోయాడని విషయం తెలిస్తే తట్టుకోలేదని కుటుంబ సభ్యులు వెంటనే ఆమెకు చెప్పలేదు. సోములమ్మ కుమారుడి ఇంటికి సమీపంలోని కుమ్మరిపుట్టులో కుమార్తె ఇంట్లో ఉంటుంది తల్లి. బుధవారం నాడు సింహాచలం పాత్రుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. కుటుంబీకులు, బంధువులు కొడుకు చావు వార్తను సోములమ్మకు చెప్పారు. అంతే.. కుమారుడి మరణ వార్తను తట్టుకోలేని సోములమ్మ ఆవేదనతో ప్రాణాలను విడిచింది.

దీంతో ఆ కుటుంబంతోపాటు ఆ గ్రామంలో తీరని విషాదం అలుముకుంది. ఇక.. తల్లి కొడుకు పార్దివ దేహాలకు ఒకేసారి అంత్యక్రియలను లగిసిపల్లిలో నిర్వహించారు. ఈ విషయం పొరుగు గ్రామాలకు కూడా పాకడంతో.. అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..