Hindupuram: బాలయ్య ఇలాకాలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు

|

May 05, 2022 | 6:13 AM

Hindupuram: ఒక తల్లి కొడుకు ఆత్మహత్యాయత్నం సంఘటన ఇప్పుడు పెద్ద రాజకీయ వివదానికి దారి తీసింది. బాలయ్య ఇలాకాలో ఒక స్థల వివాదంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ని బెదిరింపులు కారణంగా తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు..

Hindupuram: బాలయ్య ఇలాకాలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు
Follow us on

Hindupuram: ఒక తల్లి కొడుకు ఆత్మహత్యాయత్నం సంఘటన ఇప్పుడు పెద్ద రాజకీయ వివదానికి దారి తీసింది. బాలయ్య ఇలాకాలో ఒక స్థల వివాదంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ని బెదిరింపులు కారణంగా తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆరోపించడమే పెద్ద వివాదంగా మారింది.  హిందూపురం… అనంతపురం జిల్లా(Ananatapuram District) కేంద్రం తరువాత భూముల ధరలు.. ఇతర వ్యవహాల్లో అంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం.. అయితే బుధవారం ఒక స్థల విషయంలో ఏర్పడిన వివాదం ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ ఛైర్మన్ ఇంద్రజకు చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సత్యసాయి జిల్లా హిందూపురంలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరుకు తరలించారు. అసలు ఎవరు ఈ తల్లీకొడుకులు.. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారు.. ఒక్కసారి పరిశీలిస్తే.. 1992 లో సర్వేనెంబర్ 310/2లో శకుంతలమ్మ ఇంటి పట్టా తీసుకుంది. అయితే ఇటీవల ఈ స్థలాన్ని స్తానికంగా ఒక నేత తీసుకున్నాడు. కానీ మున్సిపల్ అధికారులు, అలాగే రెవెన్యూఅధికారులు భూముల విషయంపై ఆరా తీస్తుండగా.. ఈ స్థలంలో నకిలీ పట్టా పొందారని తేలింది. దీంతో అధికారులు దీనిపై స్పందిస్తూ ఇది నకిలీ పట్టా అని..వివరణ ఇవ్వాల్సిందిగా.. ఈస్థలంలో ఒక షెడ్డుకు నోటీస్ అంటించారు…

దీంతో సదరు శకుంతలమ్మ పై ఒత్తిడి తేవడంతో ఆమె,ఆమె కుమారుడు పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఎలాంటి రెఫర్ చేయకపోయినా బాధితుల్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. కానీ శకుంతలమ్మ పొందిన ఇంటి పట్టా దొంగది అంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, చైర్ పర్సన్ ఇంద్రజ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ నవీన్ భార్య జ్యోతి ఆరోపించారు. వైసిపి నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని నవీన్ భార్య జ్యోతి చెబుతున్నారు. ప్రస్తుతం బాధితులు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది…

అయితే బాధితులు.. ఎమ్మెల్సీ ఇక్బాల్ తోపాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ పేరు తీసుకుని రావడంతో ఇది పొలిటకల్ టర్న్ తీసుకుంది. కానీ ఇక్కడ టీడీపీ కానీ ఇతర పార్టీలు ఏవీ ఈ అంశంలో జోక్యం చేసుకోలేదు. కానీ ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్థానిక తాసిల్దార్ శ్రీనివాసులు స్పందిస్తూ1992 లో సర్వేనెంబర్ 310/2 లోని మున్సిపల్ స్థలంలో నకిలీ పట్టా చూపించి కబ్జాకు పాల్పడ్డారని వివరించారు. ఇంటి స్థలం సంబంధించి వివరాలు అడిగినందుకు అధికారులపైన ప్రజాప్రతినిధులపై ఆరోపించడం సరికాదు అన్నారు. నవీన్, శకుంతలను వేధించాల్సిన అవసరం ఎవరికీ లేదని తెలిపారు.అసలు ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు కూడా లేవని తెలిపారు. మొత్తం మీద తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నం చేయడం… దానికి ఎమ్మెల్సీ, మున్సిపల్ ఛైర్మన్ పేర్లు వాడటం రాజకీయంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: 

Rocket vs Helicopter: హెలికాప్టర్‌ గుడ్‌ క్యాచ్‌.. పడిపోతున్న రాకెట్‌ను పట్టుకున్న హెలికాప్టర్‌.!

Soaking Mangoes: తినే ముందు మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలో తెలుసా?.. సైన్స్ చెబుతున్న షాకింగ్ నిజాలివే..!