AP Rains: ఏపీలో ఈ జిల్లాలకు పిడుగులతో తేలికపాటి వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు..

|

Jun 07, 2024 | 9:46 PM

నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మిగిలిన భాగాలు & వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి రాబోయే 3-4 రోజుల్లో పరిస్థితులు.. ఆ వివరాలు ఇలా..

AP Rains: ఏపీలో ఈ జిల్లాలకు పిడుగులతో తేలికపాటి వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు..
Ap Rains
Follow us on

నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మిగిలిన భాగాలు & వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి రాబోయే 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ వద్ద ఉన్న ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని తెలిపారు.

శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

ఇవి కూడా చదవండి

ఆదివారం అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 50మిమీ,గోస్పాడులో 46.2మిమీ,పల్నాడు జిల్లా అమరావతిలో 44.5మిమీ,ఆళ్లగడ్డలో 43.7మిమీ, కర్నూలు జిల్లా పత్తికొండలో 43.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 41మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..