MLC Kavitha: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని పూజలు

|

Feb 25, 2024 | 1:45 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీలో పర్యటిస్తున్నారు. ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో కవిత పాల్గొని పూజలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

MLC Kavitha: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని పూజలు
Kavitha
Follow us on

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీలో పర్యటిస్తున్నారు. ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో కవిత పాల్గొని పూజలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ముత్యాలమ్మ అమ్మవారి పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మసుకృతమని అనుకుంటున్నానన్నారు.  తెలుగు రాష్ట్రాలు సుభీక్షంగా ఉండి ప్రగతి పథంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించానని చెప్పారు.

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ఏపీలో పొత్తులు కూడా ఈ ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించబోతున్నాయి. టీడీపీ జనసేనతో జతకడుతుండగా, కాంగ్రెస్ వామపక్షాలతో మద్దతు ఎన్నికలను ఎదుర్కొబోతున్నాయి. ఇక బీజేపీ పొత్తుల విషయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎపీ రాజకీయాలపై ఈ సారి తెలంగాణ నాయకులు కూడా ప్రభావం చూపబోతున్నారు. ఈమారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. అన్నీ అనుకూలిస్తే ఈ సారి బీఆర్ఎస్ నేతలు కూడా ఏపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.