Vallabhaneni Vamsi: కుట్రతోనే దుష్ప్రచారం.. విచారణ చేపట్టండి.. ఎస్పీకి వల్లభనేని వంశీ లేఖ..
ఈ ఆరోపణలు, ఫిర్యాదులో కుట్ర దాగి ఉందని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎంఎల్ఏ వల్లభనేని వంశీ.. ఎస్పీని కోరారు.
MLA Vallabhaneni Vamsi Mohan: తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆరోపణలు అవాస్తవామని.. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మోహన్ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న దుష్ప్రచారంపై సమగ్ర విచారణ చేయాలని వంశీ కోరారు. ఈ మేరకు వల్లభనేని వంశీ.. సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌషల్‌కు లేఖ రాశారు. ఉమామహేశ్వరరావు అనే యువకుడు ఇచ్చిన కంప్లైంట్‌లో వాస్తవం లేదని ఎంఎల్ఏ పేర్కొన్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా తనకు తెలిసిందని ఎంఎల్ఏ వంశీ పేర్కొన్నారు. తన పేరిట ముగ్గురు బెదిరించారన్నది అవాస్తవమని ఎంఎల్ఏ లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులో కుట్ర దాగి ఉందని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎంఎల్ఏ వల్లభనేని వంశీ.. ఎస్పీని కోరారు.
కాగా.. కొత్తపల్లికి చెందిన వైసీపీ నేత రామిశెట్టి నాగ వెంకటసాయి ఉమామహేశ్వరరావు.. ఎమ్మెల్యే వంశీ అనుచరులు తనను బెదిరించారని.. ఆయనకు వ్యతిరేకంగా మట్లాడితే చంపెస్తామన్నారని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖానికి మాస్కులు ధరించి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బైక్ ర్యాలీని సైతం ఆడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే వంశీ ఎస్పీకి లేఖ రాశారు.