MLA Rapaka: టీడీపీపై ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు.. రూ. 10 కోట్లు ఇస్తామన్నారంటూ..

|

Mar 26, 2023 | 2:50 PM

ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తొలుత టీడీపీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. తనకు తెలుగుదేశం 10 కోట్ల రూపాయలు..

MLA Rapaka: టీడీపీపై ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు.. రూ. 10 కోట్లు ఇస్తామన్నారంటూ..
Rapaka Vara Prasad
Follow us on

టీడీపీకి అమ్ముడుపోయారనే అభియోగంతో ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత తెలుగు దేశం పార్టీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని, కానీ తాను అలా చేయలేదని తెలిపారు. రాజోలులో ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన తన మిత్రుడు ఏఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారని తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా తనతో బేరాలకు దిగారన్నారు. టీడీపీకి ఓటేయాలని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.

అయితే ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్న రాపాక, సిగ్గు శరీరం వదిలేసి ఉంటే 10 కోట్లు వచ్చి ఉండేవన్నారు. తాను జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని రాపాక వరప్రసాద్ తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చోటుచేసుకోవడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం వైసీపీ తన ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, మేకపటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..