AP Politics: నెల్లూరు రూరల్ పర్యటనలో ఎమ్మెల్యే కోటంరెడ్డి.. మంత్రి అయ్యాక వరుసగా ఎమ్మెల్యేలను కలుస్తున్న కాకాని
AP Politics: నెల్లూరు రూరల్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కలిశారు...
AP Politics: నెల్లూరు రూరల్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)కలిశారు. మంత్రి అయ్యాక వరుసగా ఎమ్మెల్యేలని కలుస్తూ వస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని వెల్లటి గ్రామంలో గడప గడపకి జగన్ అన్న మాట శ్రీధర్ అన్న బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వెల్లంటి గ్రామంలోని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు మంత్రి కాకాని గడప గడపకి తిరిగారు.
ఈ సందర్భంగా కాకాని పలు వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను బాల్య స్నేహితులం.. ఒకే నెలలో పుట్టినా రోజులలో నేను పెద్దవాణ్ణి అని, అయితే రాజకీయాల్లో మాత్రం శ్రీధర్‌రెడ్డి నాకంటే పెద్ద అని కాకాని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి నన్ను పరిచయం చేసిన వ్యక్తి శ్రీధర్‌రెడ్డి అని అన్నారు. కయ్యనికైనా వియ్యని కైనా సమఉజ్జీవులమేనని అన్నారు. రాజకీయ నేపథ్యం లేకుండానే మంచి నేతగా ఎదిగేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తి కోటంరెడ్డి అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం పరిధిలోని వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు.
ఇవి కూడా చదవండి: