Kodali Nani: పవన్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే.. రజనీకాంత్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా చంద్రబాబును పొగుడుతూ ఆయన మాట్లాడడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రజనీకి కౌంటర్లు ఇస్తున్నారు.

Kodali Nani: పవన్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే.. రజనీకాంత్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Kodali Nani, Rajinikanth

Updated on: Apr 29, 2023 | 2:40 PM

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా చంద్రబాబును పొగుడుతూ ఆయన మాట్లాడడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రజనీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి రోజా సూపర్‌ స్టార్‌పై విమర్శలు కురిపించగా తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రజనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే. రజనీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించాడు. ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పవన్‌ కల్యాణ్‌ గ్రహించాలి.ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా,వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు రజనీ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను.. ప్రజలేవరూ పట్టించుకోవడం లేదు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజని తెలుగు ప్రజలకేం చెప్తాడు? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ రజనీకాంత్ మరింత దిగజారుతున్నాడు’ అని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు కొడాలి.

కాగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల కోసం శుక్రవారం (ఏప్రిల్‌28) రజనీకాంత్‌ విజయవాడ వచ్చారు. ఆయనకు నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే ఎన్టీఆర్‌, చంద్రబాబులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రజనీ. చంద్రబాబు 2047 విజన్‌ ఫలిస్తే దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌ అవుతుందని రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రజనీని కార్నర్ చేస్తూ వైసీపీ నాయకులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు  కోసం క్లిక్ చేయండి..