Gurajala MLA: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. టీడీపీ నేతకు స్ట్రాంగ్ కౌంటర్.. ఈసారి చిన్న పిల్లాడితో తొడ కొట్టించి మరీ..
గుంటూరులో రాజకీయాలు గడ్డకట్టే చలిలో సైతం చెమటలు పట్టిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే.. అటు మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లు..

Gurajala MLA: గుంటూరులో రాజకీయాలు గడ్డకట్టే చలిలో సైతం చెమటలు పట్టిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే.. అటు మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వారి చర్యలతో జిల్లాలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం దాచేపల్లిలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీసం మెలేసి తొడ కట్టారు. ఆ సదర్భంగా గురజాల్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అయితే, తాజాగా యరపతినేని వ్యాఖ్యలపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దాచేపల్లి మండలం కేసానుపల్లిలో పర్యటించిన మహేష్ రెడ్డి.. టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరని అన్నారు. టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఆ సందర్భంగా ఒక చిన్న పిల్లవాడితో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా తొడ కట్టించారు.
Also read:
