AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravathi: దానిని అసలు రాజధాని అంటారా?.. అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి జగన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంటే..

Amaravathi: దానిని అసలు రాజధాని అంటారా?.. అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి జగన్..!
Shiva Prajapati
|

Updated on: Dec 26, 2020 | 5:25 AM

Share

Amaravathi: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంటే కుల, మత, ప్రాంత బేషజాలు లేకుండా ఉండాలన్నారు. అలా కాకుండా పేదలు సహా ఏ కులం వారు రాజధానిలో ఉండకూడదంటే దానిని రాజధాని అంటారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అమరావతిలో 54వేల మంది పేదలకు పట్టాలివ్వాలని కార్యాచరణ చేపట్టి ముందడుగు వేస్తే.. కులపరమైన అసమతుల్యత అంటూ కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగ.. న్యాయస్థానం వెంటనే స్టే విధించిందన్నారు. ఈ విషయంలో కోర్టు నిర్ణయం ఆశ్చర్యమేసిందన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అంతా కలిసి ఉంటేనే రాజధాని అంటారన్న ఆయన.. అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అవుతుందని పేర్కొన్నారు. సమానత్వంతో కూడిన రాజధానిని తాము నిర్మిస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ ఉద్ఘాటించారు.

Also read:

Sankranthi Special: సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు… 1800 బస్సులను నడపనున్న ప్రభుత్వం…

శాంటాక్లాజ్ గెట‌ప్‌‌‌లో బిగ్ బాస్ 4 విన్నర్.. రోడ్డు ప‌క్క‌న ఉన్న వారికి క్రిస్మ‌స్ గిఫ్టులు అందించిన అభిజీత్