ఈ తెల్లవారుజామునే హిందూపురం నుంచి కుప్పం బయలుదేరి వెళ్లారు ఎమ్మెల్యే బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు హిందూపురం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. భారీ కాన్యాయితో కుప్పం బయలు దేరి వెళ్ళారు బాలకృష్ణ. నియోజకవర్గం మొత్తం మీద దాదాపు 50 కార్లతో కాన్వాయిగా వెళ్ళారు బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం నుంచే మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు కుప్పంకు చేరుకుంటున్నారు.
అయితే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టి నుంచి షురూ కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కి నిన్న రాత్రే చేరుకున్నారు లోకేష్. ఈ రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వరద రాజ స్వామి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 4 వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్రలో భాగంగా ఈ రోజు ఉదయం 11గంటల 3 నిమిషాలకు తన యువగళం పాదయాత్రలో భాగంగా తొలి అడుగు వేయనున్నారు లోకేష్.
మధ్యాహ్నం మూడు గంటలకు యువగళం సభకు హాజరవుతారు. సభ తర్వాత కుప్పం ప్రభుత్వ ఆస్పత్రి, శెట్టి పల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా.. రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు. తొలి రోజు 8. 5 కిలోమీటర్ల దూరం లోకేష్ యువగళం పాదయాత్ర సాగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం