Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన బాలకృష్ణ.. వైసీపీ సర్కార్‌పై ఆగ్రహం

|

Sep 09, 2023 | 11:14 AM

చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి.. ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యామని అన్నారు.

Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన బాలకృష్ణ.. వైసీపీ సర్కార్‌పై ఆగ్రహం
Balakrishna
Follow us on

చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి.. ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యామని అన్నారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడ్ని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్లు జగన్ కక్ష్యసాధిస్తున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‎మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు అంటూ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‎మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అని విమర్శించారు.

19.12.2021 లో ఎఫ్ఐఆర్ నమోదైంది అంటున్నారు.. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్‌షీట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్‎లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింపజేసినప్పుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించి కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని అన్నారు. 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని వ్యాఖ్యానించారు. మళ్లీ తప్పల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నం తినటం మానేసి.. కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఆరోపణలు చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని..ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.

చంద్రబాబు అరెస్టు..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా శనివారం ఉదయం 5 గంటల సమయంలో నంద్యాలలోని ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఎన్‌ఎస్‌జీ భద్రతతో విజయవాడ తరలిస్తున్నారు. మరికాసేపట్లోనే బాబు అక్కడికి చేరుకోనున్నారు. ఇక విజయవాడలోని ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడంతో పలు చోట్ల టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు. నారా లోకేశ్ సైతం చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టుకు వ్యతిరేకంగా క్యాంప్ సైట్ వద్ద నిరసనకు దిగారు.