Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తప్పిన ప్రమాదం.. విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం..!.

| Edited By: Balaraju Goud

Aug 21, 2024 | 11:50 AM

శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం(ఆగస్ట్ 20) రాత్రి నంధ్యాల జిల్లా శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చరియలు విరిగి పెద్ద బండరాళ్లు ఘాట్‌రోడ్డులో అడ్డంగా పడ్డాయి.

Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తప్పిన ప్రమాదం.. విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం..!.
Srisailam Landslides
Follow us on

శ్రీశైలం జలాశయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం(ఆగస్ట్ 20) రాత్రి నంధ్యాల జిల్లా శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చరియలు విరిగి పెద్ద బండరాళ్లు ఘాట్‌రోడ్డులో అడ్డంగా పడ్డాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ని కలిపే రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

శ్రీశైలంలో భారీ వర్షం దంచికొట్టింది. రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం దాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రంతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీశైలంలోని ప్రధాన రహదారులు వర్షపు వరద పొంగిపొర్లుతోంది. శ్రీశైలం జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే కొండ చరియలు రాత్రి సమయంలో విరిగి పడడంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, రోడ్డుపై పడ్డ కొండ చరియల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.

గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణ సమయంలో నీటి తుంపర్లు పడడంతో కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలానే వర్షాకాలంలో కొండచరియలు విరిగి పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కొండచరియలు విరిగి పడకుండా శాశ్వత పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..